ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 6:39 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

కరీంనగర్ జిల్లా నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్ష కరీంనగర్

కరీంనగర్,అర్జున్ సమాచారం:
ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  చేతుల మీదుగా కరీంనగర్ జిల్లా నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్  సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్కు పలు సూచనలు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
ముఖ్యమంత్రి  పర్యటనలో భాగంగా ఏర్పాటు చేయనున్న హెలిప్యాడ్ను పరిశీలించారు. . నూతన కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ప్రాంగణంతో పాటు జిల్లా కలెక్టర్ ఛాంబర్, ముఖ్యమంత్రి  పర్యటించే ప్రాంతాలను పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేసారు.
ప్రారంభోత్సవం అనంతరం నూతన కలెక్టరేట్లో అధికారులకు ముఖ్యమంత్రి  దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వెళతారు. ముఖ్యమంత్రి  పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్ తదితర ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. నడం జరిగింది.
=======================